తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ.. హెల్మెట్ రంగుల వెనుక కథ ఇదే!
- టైప్-1 హెల్మెట్లతో పై నుంచి పడే వస్తువుల నుంచి రక్షణ
- టైప్-2 హెల్మెట్లతో తల పక్క భాగాలకూ భద్రత
- క్లాస్-జీ హెల్మెట్లు పరిమిత స్థాయిలో విద్యుత్‌తో రక్షణ
- క్లాస్-ఈ హెల్మెట్లు అధిక వోల్టేజ్ పనులకు అనుకూలం
- క్లాస్-సీ హెల్మెట్లు వెంటిలేషన్, సౌకర్యానికి ప్రాధాన్యం
నిర్మాణ రంగంలో భద్రత అంటే ముందుగా గుర్తుకు వచ్చేది హెల్మెట్. పై నుంచి ఏదైనా వస్తువు పడినా, ప్రమాదవశాత్తు తలకు దెబ్బ తగిలినా మొదటి రక్షణ ఇదే. కానీ అన్ని హెల్మెట్లు ఒకేలా పనిచేయవు. పని స్వభావం, ప్రమాద రకం, విద్యుత్ ముప్పు వంటి అంశాలను బట్టి హెల్మెట్లను ప్రత్యేకంగా రూపొందిస్తారు. అందుకే నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లో వివిధ రకాల భద్రతా హెల్మెట్లు వాడుతున్నారు. వాటి ప్రత్యేకతలు, ఉపయోగాలు తెలుసుకోవడం ప్రతి ఉద్యోగికి అవసరం.
టైప్-1 హెల్మెట్లు
టైప్-1 హెల్మెట్లు ప్రధానంగా తల పైభాగానికి రక్షణ కల్పిస్తాయి. నిర్మాణ ప్రాంగణాల్లో పై నుంచి పనిముట్లు, ఇనుప సామగ్రి, కాంక్రీట్ ముక్కలు లేదా ఇతర వస్తువులు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ హెల్మెట్లు ఉపయోగపడతాయి. హెల్మెట్‌లో ఉండే ప్రత్యేక సస్పెన్షన్ వ్యవస్థ దెబ్బ తీవ్రతను తగ్గిస్తుంది. భవన నిర్మాణాలు, రోడ్లు, వంతెనల పనుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
టైప్-2 హెల్మెట్లు
టైప్-2 హెల్మెట్లు తల పైభాగంతో పాటు పక్క వైపులకూ రక్షణ ఇస్తాయి. ఇరుకైన ప్రదేశాల్లో పనిచేసే సమయంలో యంత్రాలు, ఇనుప బీమ్స్, ఇతర వస్తువులకు తల తగిలే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ హెల్మెట్లు అదనపు భద్రత కల్పిస్తాయి. భారీ పరిశ్రమలు, వాణిజ్య భవన నిర్మాణాలు, సంక్లిష్ట ప్రాజెక్టుల్లో ఇవి ఎక్కువగా వాడతారు.
క్లాస్-జీ హెల్మెట్లు
క్లాస్-జీ లేదా జనరల్ హెల్మెట్లు సాధారణ నిర్మాణ పనుల కోసం రూపొందించారు. ఇవి దెబ్బల నుంచి రక్షణతో పాటు పరిమిత స్థాయిలో విద్యుత్ రక్షణను కూడా అందిస్తాయి. సాధారణంగా 2,200 వోల్ట్ల వరకు రక్షించే సామర్థ్యం వీటికి ఉంటుంది. విద్యుత్ వ్యవస్థల సమీపంలో పనిచేసే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి.
క్లాస్-ఈ హెల్మెట్లు
క్లాస్-ఈ హెల్మెట్లను విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇవి అధిక విద్యుత్ నిరోధకత కలిగి ఉంటాయి. సాధారణంగా 20,000 వోల్ట్ల వరకు రక్షణ కల్పిస్తాయి. విద్యుత్ లైన్లు, యుటిలిటీ కనెక్షన్లు, సబ్స్టేషన్లు, భారీ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు ఇవి అవసరం. తలకు దెబ్బల నుంచి రక్షణతో పాటు విద్యుత్ షాక్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
క్లాస్-సీ హెల్మెట్లు
క్లాస్-సీ హెల్మెట్లు ప్రధానంగా సౌకర్యం, గాలి ప్రసరణ కోసం రూపొందించారు. ఇవి తేలిగ్గా ఉంటాయి. వెంటిలేషన్ ఎక్కువగా ఉండటం వల్ల వేడి వాతావరణంలో పని చేసే వారికి అనుకూలంగా ఉంటాయి. అయితే వీటికి విద్యుత్ నిరోధకత ఉండదు. అందువల్ల కరెంట్ ప్రమాదం లేని ప్రాంతాల్లో మాత్రమే వీటిని ఉపయోగించాలి. పెయింటింగ్, ఇంటీరియర్ పనులు, కార్పెంట్రీ వంటి పనుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
రంగుల వెనుక అర్థం
నిర్మాణ ప్రాంగణాల్లో హెల్మెట్ రంగులు కూడా ప్రత్యేక గుర్తింపుగా పనిచేస్తాయి. సాధారణంగా ఇంజినీర్లు, సూపర్వైజర్లు తెలుపు రంగు హెల్మెట్లు ధరిస్తారు. సాధారణ కార్మికులు పసుపు రంగు హెల్మెట్లు వాడుతారు. నైపుణ్యం కలిగిన సాంకేతిక సిబ్బంది నీలం రంగు హెల్మెట్లు ధరించగా భద్రతా అధికారులు ఆకుపచ్చ రంగు హెల్మెట్లు ఉపయోగిస్తారు. కంపెనీని బట్టి రంగుల్లో మార్పులు ఉండొచ్చు. అయితే సైట్లో ఎవరు ఏ బాధ్యతలో ఉన్నారో త్వరగా గుర్తించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.